![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -982 లో.. ఎండీగా మొదటిసారిగా కాలేజీ ఫెస్ట్ జరిపిస్తున్నానని వసుధార భావించి జగతి ఫోటో దగ్గరికి వెళ్లి మొక్కుకొని.. త్వరగా రండి అని మహేంద్రకి చెప్పి వెళ్తుంది. వసుధార వెళ్ళగానే జగతి ఫోటో కిందకి పడిపోతుంది. అది చూసి మహేంద్ర ఏం జరుగుతుందో? ఏంటోనని భయపడుతాడు.
ఆ తర్వాత వసుధార కాలేజీకి వెళ్లి స్టుడెంట్స్ తో మాట్లాడుతూ లోపలికి వెళ్తుంటుంది. అప్పుడే స్టార్టింగ్ లో వెల్కమ్ బ్యాక్ అంటు రిషి ఫ్లెక్స్ లు ఉంటాయి. అవి చూసి వసుధార షాక్ అవుతుంది. స్టుడెంట్స్ వసుధారని రిషి సర్ వస్తున్నారట కదా మేడమ్.. చాలా హ్యాపీగా ఉందని అనేసరికి వసుధారకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ తర్వాత వసుధార దగ్గరికి శైలెంద్ర వస్తాడు. ఇదంతా నువ్వే చేసావ్ కదా అని వసుధార అడుగగానే.. అవును ఫెస్ట్ ని సక్సెస్ చేస్తానంటూ ఛాలెంజ్ విసిరావు కదా.. అందుకే అని శైలెంద్ర అంటాడు. ప్లీజ్ ఈ ప్లెక్సీ లు తీయుంచు రిషి సర్ ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేరని వసుధార అంటుంది. ఈ విషయం ఆల్రెడీ మినిస్టర్ గారి దగ్గర వరకు వెళ్ళిందని శైలేంద్ర అంటాడు. వసుధారకి ఏం చెయ్యాలో అర్ధం కాదు. ఆ తర్వాత వసుధార లోపలికి వెళ్తుంది. స్టూడెంట్స్ ఫాకల్టీ అందరు రిషి సర్ వస్తున్నాడు. మాకు చాల హ్యాపీగా ఉందంటూ చెప్తుంటే.. వసుధారకి ఏం చెప్పాలో అర్ధం కాదు. ఆ తర్వాత అనుపమ, మహేంద్ర కాలేజీకి వస్తారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీ చూసి వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఎవరు పెట్టారని మహేంద్ర ఒక స్టుడెంట్ ని పిలిచి అడుగుతాడు. వసుధరా మేడమ్ అని స్టూడెంట్ చెప్పగానే.. వసుధార మనకి చెప్పకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంది. ఇప్పుడు రిషి ఎలా వస్తాడని వసు దగ్గరకి వెళ్లి అడుగుతారు. నేను చెయ్యలేదు.. అదంతా శైలెంద్ర పనే అని వసుధార చెప్పగానే.. వాడు మనల్ని తెలివిగా కరెక్ట్ టైమ్ చూసి ఇరికించాడని మహేంద్ర అంటాడు.
ఆ తర్వాత అక్కడికి ఫణీంద్ర వచ్చి.. నాకు తెలుసు వసుధార.. నువ్వు రిషిని తీసుకొని వస్తావంటు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మినిస్టర్ గారు వస్తున్నారంటు మహేంద్రని ఫణీంద్ర తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఏం చేస్తావని వసుధారని అనుపమ అడుగుతుంది. నన్ను కాసేపు వదిలెయ్యండి. నేను అలోచించుకోవాలని వసుధార అనగానే అనుపమ వెళ్లిపోతుంది. ఆ తర్వాత వసుధార దగ్గరికి శైలేంద్ర వచ్చి.. ఇప్పుడు నువ్వు రిషి ని తీసుకొని రాలేవు. స్టూడెంట్స్ అందరు గొడవ చేస్తారు. ఫెస్ట్ ఫెయిల్ అవుతుంది. అందుకే ఈ ప్లాన్ చేశానని శైలేంద్ర అనగానే రిషి సర్ ని తీసుకొని వస్తాను. ఇక నువ్వు బయపెట్టడం.. నేను భయపడడం వద్దు. ఈ రోజుతో అన్ని క్లోజ్ .. రిషి సర్ వస్తారు. నీ నిజస్వరూపం అందరి ముందు బయటపెడతానని వసుధార అనగానే.. శైలేంద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |